Game Changer : RRR తరువాత రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకేక్కిస్తున్నాడు.
ఇది అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ ఇందులో నటిస్తుంది. ఇప్పుడు తాజాగా గేమ్ చెంజర్ కు సంబందించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబందించిన రెండవ లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు. “ రా మచ్చా మచ్చా ” అనే పాటను రిలీజ్ చేసారు.
అయితే ఈ సినిమా నుంచి “ జరగండి జరగండి ” పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండవ సాంగ్ కూడా మెగా ఫాన్స్ తో పాటు యువత నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే విధంగా ఉంది.అయితే ఈ పాటకు అనంత శ్రీరామ్ అద్భుతంగా లిరిక్స్ రాసాడు. ఈ పాటలో 1000 మంది డాన్సర్స్ పాల్గొన్నట్టు సమాచారం. ఇది క్రిస్మస్ కి తెలుగు,తమిళం ,హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.
2 thoughts on “Game Changer : గేమ్ చేంజర్ నుంచి “రా మచ్చా మచ్చా ” సాంగ్ రిలీజ్”