Bollywood: బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందా కు బుల్లెట్ గాయాలు …
Bollywood Actor Govinda : బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందా కాలికి తీవ్రమైన గాయమైంది. ఆయన ముంబైలో తన నివాసంలో ఉండగా ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
Game Changer : గేమ్ చేంజర్ నుంచి “రా మచ్చా మచ్చా ” సాంగ్ రిలీజ్
కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటన తెల్లవారుజామున 4:45 గంటలకు జరిగింది. ఆయన తన గన్ ను శుభ్రం చేసే క్రమంలో మిస్ ఫైర్ కావడంతో కాలికి గాయమైనట్లు సమాచారం.
ఈ 60 ఏళ్ల స్టార్ నటుడు శివసేన పార్టీ నాయకులు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన తన నివాసంలో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన మేనేజర్ ఆసుపత్రికి తరలించాడు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తీవ్రమైన కలకలం గా మారడంతో బాలీవుడ్ వర్గాలలో ఆందోళన నెలకొంది.