Badvel : కడప జిల్లా బద్వేల్ ప్రాంతానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ప్రేమ ఉన్మాది విగ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. బాధితురాలు నిన్నటి నుంచి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించింది. బాధితురాలు మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
AP NEWS: ఇసుక ట్రాక్టర్లు కు అనుమతి
ప్రేమ ఉన్మాది విగ్నేష్ కోసం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిన్న రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు.
శనివారం రోజు బాధిత యువతకి ఫోన్ చేసిన విగ్నేష్ తనను కలవాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆమెను బెదిరించాడు. మరొక గత్యంతరం లేని విద్యార్థిని కళాశాల నుంచి బయటికి వచ్చి ఆటోలో బయలుదేరగా, విగ్నేష్ మధ్యలో ఆటో ఎక్కాడు. బద్వేల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఉన్న ముళ్లపదల్లోకి ఆమెను తీసుకువెళ్లాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిందితుడు విగ్నేష్ పరారయ్యాడు.
తీవ్రంగా కాలిన గాయాలతో గట్టిగా విద్యార్థి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మహిళలు రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే 80 శాతం వరకు తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఈ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.
2 thoughts on “Badvel : పెట్రోల్ దాడికి గురైన మైనర్ విద్యార్థిని మృతి…”