Breaking News : వంగవీటి రాధాకృష్ణకు స్వల్ప అస్వస్తత
AP Highcourt:హైకోర్టులో ఆదిమూలం కు ఊరట
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు హైకోర్టులో ఊరట లభించింది. ఆదిమూలం పై నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు ఈరోజు కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది.
తిరుపతి పోలీసులు ఆదిమూలంపై లైంగిక వేధింపుల కేసును నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 5న ఆదిమూలంపై బలాత్కారం మరియు బెదిరించి రేప్ చేయడం కేసులు నమోదు చేశారు.
బాధిత మహిళ సెప్టెంబర్ ఐదున రాత్రి 11:15 గంటలకుబాధితురాలు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు.బీమాస్ పేరడైజ్ హోటల్లో సంఘటన జరిగింది ఈ హోటల్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఆ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడని అందుకు సంబంధించిన వీడియోను మీడియా ఛానల్లో విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేవీబీ పురం మండలానికి చెందిన బాధిత మహిళ చివరకు ఎమ్మెల్యేతో రాజి పడినట్లు సమాచారం.
తనను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించారని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో చేసి పెట్టిన బాధిత మహిళ శుక్రవారం అనగా సెప్టెంబర్ 20న హైకోర్టుకు హాజరై ఎమ్మెల్యే ఆదిమూలంపై తాను పెట్టిన కేసు అందులో పేర్కొన్న ఆరోపాలు అన్ని తప్పుడు ఆరోపాలని చెప్పడం గమనార్హం.
ఎమ్మెల్యే ఆదిమూలం తనపై నమోదైన కేసును కొట్టు వేయాలని హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం గత శుక్రవారం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది సి.రఘు ఆదిమూలం తరుపున వాదనలు వినిపించాడు.
ఆదిమూలంపై పోలీసులు పెట్టిన కేసులో సెక్షన్లు వర్తించవని, మహిళా పోలీసు అధికారిణి నమోదు చేయాల్సిన కేసును పురుష పోలీసు అధికారి నమోదు చేశారని, జూలై, ఆగస్టు నెలల్లో సంఘటన జరిగితే సెప్టెంబరు 5న కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు వివరించారు. ఇదిలా ఉండగా మూడవ వ్యక్తి ప్రమేయంతోనే మహిళ కేసు పెట్టిందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టి వేయాలని కోరారు.
మరోవైపు బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అంశాలన్నీ అవాస్తవమని, ఈ మేరకు నోటరీతో కూడిన అఫిడవిట్‌ను బాధిత మహిళ కోర్టుకు సమర్పించిందని, అందువల్ల ఈ కేసును కొట్టి వేయాలని మహిళ తరఫు న్యాయవాది జితేందర్ సైతం కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృష్ణసాగర్ తీర్పును నేటికి తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు ఆదిమూలంపై కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
3 thoughts on “AP Highcourt:హైకోర్టులో ఆదిమూలం కు ఊరట”