AP NEWS: YS జగన్ తిరుమల పర్యటన రద్దు … తో తిరుమలలో అనూహ్యపరిణామం

AP NEWS: YS జగన్ తిరుమల పర్యటన రద్దు … తో తిరుమలలో అనూహ్యపరిణామం

ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డులో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు ఆరోపాలు చేశాడు. ఆ ఆరోపాలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు .

చంద్రబాబు చేసిన ఆరోపాలన్నీ తప్పుడు ఆరోపాలని తిరుమల శ్రీవారి ఖ్యాతిని దిగజారే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్రంలో ఉన్న ఆలయాల్లో శనివారం వారి పూజలో పాల్గొనాలని ఆయన పార్టీ వర్గం సూచించింది. అదే తిరుమల రాత్రి అక్కడే బస చేయాలని నిర్ణయించాడు.

AP Highcourt:హైకోర్టులో ఆదిమూలం కు ఊరట

జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తానంటూ వార్త మరుక్షణం నుంచే కొత్తగా డిక్లరేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చారు. అయితే కూటమి ప్రభుత్వ నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి, జనసేన టిడిపికి చెందిన పలువురు నిమిషాలు తిరుమలలో జగన్ ఇక్కడ వే షం సమర్పించాలంటు పట్టుబట్టారు.

జగన్ తిరుమల రానున్నారని విషయం తెలిశాక కూడా కొత్తగా డిక్లరేషన్కు సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. తిరుమలలో పలు ప్రాంతాలలో టీటీడీ అధికారులు డిక్లరేషన్ కు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైందవేతురుల ఆలయ ప్రవేశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలు అవి.

శ్రీవారి ఆలయం కేవలం హిందువులకు మాత్రమే చెందిందని హైందవేతురులు ఆలయ ప్రవేశం చేయాలి అనుకుంటే శ్రీవారిపట్ల విశ్వాసం గౌరవం ఉన్నట్లు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అందులో ఉంది. తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లు ,, అదనపు కార్య నిర్వాహణాధికారి క్యాంప్ ఆఫీసు , రిసెప్షన్ కార్యాలయము , అన్ని ఉప విచారణ కార్యాలయాల వద్ద డిక్లరేషన్ ఫామ్ లు అందుబాటులో ఉంటాయని ఫ్లెక్సీలలో పొందుపరిచారు.

జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపిన వెంటనే ఆ ఫ్లెక్సీలను అప్పటికప్పుడు తొలగించారు టీటీడీ సిబ్బంది. దీంతో అవన్ని జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించే చేశారంటూ వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు .

One thought on “AP NEWS: YS జగన్ తిరుమల పర్యటన రద్దు … తో తిరుమలలో అనూహ్యపరిణామం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *