Viral News: గ్రీన్ కలర్ కోడిగుడ్లు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తుంది. మనం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం వాటిల్లో కొన్ని నిజమైన వీడియోలు ఉండొచ్చు ఫేక్ వీడియోస్ కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకుపచ్చ రంగు కోడి గుడ్డు కూడా సంచలనాన్ని సృష్టిస్తుంది. అయితే అసలు ఈ వీడియో రియల్ ఆ లేక ఫేక్ అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా కోడి గుడ్డు లోపల సొన తెలుపు రంగు లేదా పసుపు రంగులో ఉంటుంది. అయితే ఈ కోడిగుడ్డులో మాత్రం లోపల ఆకుపచ్చ రంగులో ఉంది. అయితే ఈ వీడియో పట్ల సోషల్ మీడియాలో కొంతమంది ఇది ఫేక్ వీడియో అని మరి కొంతమంది ఇది నిజమైన వీడియో అని ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది . అంతేకాదు సాధారణ కోడిగుడ్లు కంటే కూడా ఈ ఆకుపచ్చ రంగు కోడిగుడ్లు మంచివని కొత్త ప్రచారం జరుగుతుంది . ఇది ఎంతవరకు నిజమని చాలామంది భావిస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రోజుకు ఒక గుడ్డు తినడం మంచిది అని చెబుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంట్లోని చిన్నపిల్లలను కూడా రోజు గుడ్లు తినమని చెబుతూ ఉంటారు. కోడిగుడ్లు శాఖాహారమని వాటి నుంచి మంచి పౌష్టిక ఆహారం లభిస్తుందని అంటూ ఉంటారు.
మనం ఎప్పుడు పసుపు సొన లేదా తెలుపు సొన ఉన్న కోడిగుడ్లనే తింటూ ఉంటాం. ఆకుపచ్చ సొన ఉన్న గుడ్లను తినడం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయా! అసలు ఈ ఆకుపచ్చ కోడిగుడ్లు ఉన్నాయా!
అయితే పూర్తిగా తెలుసుకుందాం రండి.
కేరళకు చెందిన షిహాబుద్దీన్ అనే రైతు కోళ్ల ఫారం నిర్వహిస్తూ ఉన్నాడు. అతని దగ్గర ఉన్న కోళ్లు మాత్రం ఆకుపచ్చ రంగు కోడి గుడ్లను పెడుతున్నాయి.
అసలు ఆకుపచ్చ రంగులు కోడిగుడ్లు ఎందుకు పెడుతున్నాయి.
కేరళలోని వెటర్నరీ అండ్ అనిమల్ సైన్స్ యూనివర్సిటీ కోడిగుడ్ల మీద ఒక పరిశోధన చేసింది. అసలు కోడిగుడ్డు లోపల సొన పసుపు రంగులో మాత్రమే ఎందుకు ఉంటుంది అని పరిశోధన జరపగా అది కోళ్లు తినే ఆహారాన్ని బట్టి రంగు మారుతూ ఉంటాయని పరిశోధనలు తేలింది. కోళ్లు తినే ఆహారంలో కెరోటినాయిడ్స్ పదార్థం ఉండటం వలన కెరోటినాయిడ్స్ ఏ రంగులో ఉంటాయి అనేదాన్ని బట్టి కోడిగుడ్డు సొన రంగు మారుతూ ఉంటుంది.
అక్కడ పరిశోధకులు కోళ్ల కోరక రకాల ఆహార పదార్థాలను మార్చుతూ ఉండటం వలన గుడ్డులోని సన రంగు మారుతూ వచ్చింది. చివరికి కేరళలో ని మొక్కలు ,మూలికలు, విత్తనాలతో కలిపిన పౌష్టికాహారాన్ని కోళ్లకు అందజేయడం వలన అవి క్రమంగా ఆకుపచ్చ సొన ఉన్న కోడి గుడ్లను పెట్టటం మొదలుపెట్టాయి.
ఈ ఆకుపచ్చ రంగు కోడిగుడ్లలో ఎక్కువ పోషకాహారాలు ఉండటం వలన రైతులకు అటువంటి ఆహార పదార్థాలను అందజేస్తున్నారు.
అదేవిధంగా ఈ రైతు కూడా అటువంటి ఆహార పదార్థాలను తీసుకొని తన కోళ్లకు రోజు అందించడం ద్వారా కోడిగుడ్డు లోపల పసుపు రంగులో మారడం జరిగింది.
ఇలా గ్రీన్ కలర్ లో గుడ్డు ఉండటం వల్ల ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది అయితే ఇది నిజమైన వీడియో అని తెలియడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.