Vinesh Phogat: హర్యానా ఎన్నికల్లో కుస్తీ యోధురాలు వినేష్ ఫోగాట్ (Vinesh Phogat) విజయం సాధించారు. కాంగ్రెస్ తరుపు జులనా నియోజక వర్గం నుంచి పోటీ చేసింది. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో వినేష్ ఫోగాట్ విజయం సాధించింది.
Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కే… పట్టంకట్టిన జులానా ప్రజలు
పారిస్ ఒలంపిక్స్ లో పతాకాన్ని చేజార్చుకున్న వినేష్ ఫోగాట్ హర్యానా ఎన్నికలలో మాత్రం విజయం సాధించింది. జులనా నియోజక వర్గం నుంచి పోటీగా నిలిచిన BJP అభ్యర్థి యోగేష్ కుమార్ , ఆప్ అభ్యర్థి కవిత రాణి వినేష్ ఫోగాట్ చేతిలో ఓటమి పాలయ్యారు.
Mohamed muizzu: ద్వైపాక్షిక చర్చల కోసం భారత్ చేరుకున్న మొహమ్మద్ ముయిజ్జు
విజయం సాధించిన తరువాత వినేష్ ఫోగాట్ మీడియా తో మాట్లాడుతూ … ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించింది. ఇది ప్రజల యొక్క పోరాటం . ఇందులో ప్రజలే గెలిచారు. నేను కేవలం ప్రజల యొక్క ప్రతినిధిని మాత్రమే . రానున్న ఐదేళ్లపాటు ప్రజల యొక్క అంచనాలను అందుకోవడాని కృషి చేస్తానని తెలిపారు.
వినేష్ ఫోగాట్ గెలుపు పై అభినందనలు తెలుపుతూ రెజ్లర్ బజరంగ్ పునియ పోస్ట్ చేశారు. ” విజయం సాధించిన భారత పుత్రిక వినేష్ ఫోగాట్ అభినందనలు అంటూ పోస్ట్ చేసారు.
BJP ప్రత్యర్థి యోగేష్ కుమార్ పై 6 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. హరియాణ ఎన్నికలు అక్టోబర్ 5 జరిగాయి . ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి . మొదట ఆధిపత్యాన్ని చూపిన కాంగ్రెస్ తరువాత BJP దెబ్బకి రెండో స్థానానికి పరిమితమైంది.
పారిస్ ఒలంపిక్స్ ఫైనల్ లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేష్ ఫోగాట్ అనర్హత కు గురైంది. ఈ పరిణామం మొత్తం భారతదేశాన్ని బాధించింది. అనంతరం ఆమె కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించింది.
One thought on “Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కే… ఓటేసిన జులానా ప్రజలు”