Today weather report : మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వాతావరణం శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 24 నాటికి వాయుగుండం గా మారే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇది ఎటు వెళుతుంది అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
AP NEWS: ఇసుక ట్రాక్టర్లు కు అనుమతి
అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అక్టోబర్ 20న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరొక ఉపరితల ఆవర్తనం మధ్య అండమాన్ సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటితో పాటుగా వేరొక ఉపరితల ఆవర్తనం మధ్య అరేబియా సముద్రమట్టం నుంచి పైకి 3.1 కిలోమీటర్లు ఎత్తువరకు వ్యాపించి ఉంది.
వీటి ప్రభావంతో ఆదివారం రోజున అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం అమరావతి వాతావరణం శాఖ తెలిపింది.