TIRUMALA LADDU : సుప్రీంకోర్టు చొరవతో … విచారణ వేగవంతం
TIRUMALA LADDU : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో నెలకొన్న వివాదం పై దర్యాప్తు త్వరితగతిన సాగుతోంది. తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే విధంగా , లడ్డు తయారీ లో వాడే నెయ్యి లో జంతుకోవ్వు తో కల్తీ చేసారన్న ఆరోపాలపై ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది.
తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా జంతువు వాడారంటూ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపాలు చేసిన విషయం తెలిసింది.
Supreme Court: దేవుడితో రాజకీయాలు చేయకండి… సుప్రీమ్ కోర్టు కీలక సూచన
కాంట్రాక్టు పద్ధతి ద్వారా సరఫరా చేసిన నెయ్యిని ఫ్లోర్ మిల్లులోనే నిల్వ ఉంచుతారు టిటిడి సిబ్బంది. ల్యాబ్ నుంచి వచ్చినా రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని అది స్వచ్ఛమైన నెయ్యి అని నిర్ధారించుకున్న తరువాత ఈ ఫ్లోర్ మిల్లులో స్టోర్ చేస్తారు. అన్లోడింగ్ కోసం ఫ్లోర్ మిల్లుకు వచ్చిన ట్యాంకర్లు , అప్పటికే అక్కడ నిల్వ ఉన్న ట్యాంకర్లనుంచి శాంపిల్స్ సేకరించారు.
టీటీడీ యొక్క నెయ్యి పరీక్ష విధానాన్ని అడిగి అనుచరిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. సమగ్ర విచారణ జరిపారు. అలాగే లడ్డు తయారీలో ఉపయోగించే ఎండు ద్రాక్ష, కాజు, ఇతర ఇంగ్రిడియాన్స్ యొక్క నాణ్యతను పరిశీలించారు. అదేవిధంగా ల్యాబ్ సిబ్బందిని కూడా విచారణ జరిపారు.
తిరుమల శ్రీవారి పోటు కు వెళ్లిన సిట్ బృందం, శ్రీ వైష్ణవ ఉద్యోగులను లడ్డు తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఫ్లోర్ నుంచి శ్రీవారి పోటుకు నెయ్యి తరలింపు మరియు లడ్డులో వాడే ఇతర ఇంగ్రిడియాన్స్ తరలింపు విధానంపై విచారణ జరిపారు. ఎంట్రీ జాబితాను పరిశీలించారు.