Supreme Court: తిరుమల లడ్డు వివాదంపై … స్వతంత్ర దర్యాప్తు సంస్థ కు సుప్రీంకోర్టు అంగీకారం

Supreme Court: తిరుమల లడ్డు వివాదంపై … స్వతంత్ర దర్యాప్తు సంస్థ కు సుప్రీంకోర్టు అంగీకారంతిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి లో జంతుకోవ్వు తో కల్తి చేసారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

Supreme Court: తిరుమల లడ్డు వివాదంపై … స్వతంత్ర దర్యాప్తు సంస్థ కు సుప్రీంకోర్టు అంగీకారంతిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి లో జంతుకోవ్వు తో కల్తి చేసారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ B.R గవాయి , జస్టిస్ K.V విశ్వనాధన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 5 గురు సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థను (సిట్ ) ఏర్పాటు కు సుప్రీంకోర్టు ఆదేశించింది.

AP News : కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఈ దర్యాప్తు సంస్థలో సిబిఐ నుంచి ఇద్దరు, ఏపీ రాష్ట్రప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీస్ లు , ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని తెలిపింది. అయితే CBI డైరెక్టర్ ఈ స్వతంత్ర దర్యాప్తును పర్యవేక్షిస్తాడు అని తెలిపారు.  ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని ద్రుష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

అంతకుముందు సుప్రీంకోర్టు కు కేంద్రం తరుపున సొలిటర్ జనరల్ మెహత తన అభిప్రాయాన్ని తెలపారు. “ మొత్తం అంశాన్ని పరిశీలించాను” ఇది భక్తుల మనోభావాలకు సంబందించిన సున్నితమైన విషయం. దర్యాప్తు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం పై ఎలాంటి సందేహాలు లేవని , అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థను కోరుకుంటున్నారు కాబట్టి… దర్యాప్తు పై  సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే విశ్వాసం ఉంటుందని అని పేర్కొన్నారు.

పిటిషనర్ల లో ఒకరు అయిన YSRCP MP , TTD మాజీ చైర్మన్ Y.V సుబ్బారెడ్డి  తన పదవికి సంబంధించిన అంశాలు తెలపకపోవడంతో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని రాజకీయంగా వాడుకోవద్దని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థ ఏర్పాటును ధర్మాసనం తిరస్కరించింది.

మాజీ ఎంపి సుబ్రమణ్యస్వామి ,YCP ఎంపి Y.V సుబ్బారెడ్డి  , విక్రమ్ సంపంత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ మరియు మలువురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ జరపాలని విన్నవిస్తూ… ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసారు.

ఈ వివాదంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు , ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో దర్యాప్తు చేయాలా? లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను చేయాలా? అని కేంద్రం తరుపు సొలిటర్ జనరల్ మెహతా ను అడిగింది. కాగా తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం  3:30 గంటలకి వాయిదా వేసింది.

అదే ప్రకారం విచారణ చేపట్టిన ధర్మాసనం హాజరైన మెహతా …తనకు మరొక కేసు విచారణలో ఉన్నందున ఈ కేసు విచారణ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు విచారణ జరపాలని కోరారు. మెహతా విజ్ఞప్తిని పరిగానలోనికి తీసుకున్న ధర్మాసనం … ఈ కేసును శుక్రవారం మొదటి నంబరు కింద విచారణ జరపడానికి అంగీకరిస్తూ వాయిదా వేసింది. నేడు విచారణ చేసిన సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

One thought on “Supreme Court: తిరుమల లడ్డు వివాదంపై … స్వతంత్ర దర్యాప్తు సంస్థ కు సుప్రీంకోర్టు అంగీకారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *