Ratan tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత

Yahya sinwar: ప్రాణాలతో ఉన్న హమాస్ అధినేత యహ్యా సిన్వార్

రతన్ టాటా యొక్క మరణ వార్త తెలిసిన వెంటనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ బ్రిచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారు. రతన్ టాటా క్రియాలను అధికారిక లాంచనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, సోమవారం ఆయన ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై స్పందించిన రతన్ టాటా తన ఆరోగ్యం బాగానే ఉందని కేవలం వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు.

1937 డిసెంబర్ 28న రతన్ టాటా ముంబైలో జన్మించారు. రతన్ టాటా యొక్క తండ్రి నావల్ టాటా, తల్లి సోనీ టాటా. ఆయన కార్నెల్ యూనివర్సిటీ నుంచి బి ఆర్క్ పట్టాను 1967లో పొందారు.

1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించారు. జే ఆర్ డి టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్ గా 1991లో బాధ్యతలు చేపట్టారు.

టాటా గ్రూప్స్కు 1990 నుంచి 2012 వరకు రతన్ టాటా చైర్మన్గా వ్యవహరించారు. 2016 అక్టోబర్ నుండి 2017 ఫిబ్రవరి వరకు తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు.

భారత ప్రభుత్వం రతన్ టాటా యొక్క సేవలను గుర్తిస్తూ 2000 లో పద్మ భూషణ్, 2008లో పద్మ విభూషణ్ ను ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *