Rajendra Prasad:తెలుగు ప్రముఖ సినీ నటుడు , నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం రాత్రి రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రీ (38) కి గుండె పోటు రావడంతో గమనించిన కుటుంబసభ్యలు వెంటనే నగరం లోని ఓ పెద్ద ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాసవిడిచింది.
Game Changer : గేమ్ చేంజర్ నుంచి “రా మచ్చా మచ్చా ” సాంగ్ రిలీజ్
గాయత్రి కి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. చిన్న వయసులో తమ కూతురిని కోల్పోవడాన్ని రాజేంద్ర ప్రసాద్ దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. గాయత్రీ పార్థివ దేహాన్ని కే పీ హెచ్ బి లో రాజేంద్ర ప్రసాద్ నివాసం ఉంటున్న ఫార్చూన్ విల్లా 226 లో సందర్శనాకు ఉంచారు.
గాయత్రీ మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరు గా ఆయన ఇంటికెళ్లి పరామర్శిస్తున్నారు.
One thought on “Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం”