rain alert: ఏపీ మరొక సారి రైన్ అలెర్ట్…
AP Government : పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక పెన్షన్ డబ్బులు అకౌంట్లోనే కొందరికి మాత్రమే !
rain alert: ఏపీకి వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీకి మరొకసారి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పొలాలలో పనిచేసే రైతులు కూలీలు అలాగే పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్ళొద్దని హెచ్చరించి.
ఈదురు గాలులు వీస్థాయని, సముద్ర తీరంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీ సత్య సాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
అలాగే అన్నమయ్య , చిత్తూరు , వైయస్సార్ జిల్లా, నెల్లూరు, గుంటూరు, బాపట్ల, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడనున్నాయి.
అల్లూరి జిల్లాలో డుంబ్రి గూడెం మండలంలో దేమూడు వలస పొలాల్లో సుడిగాలులు రావడంతో రైతులు మరియు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొంత సమయానికి సుడిగాలులు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులతో పాటు సముద్రతీరా ప్రాంతాలలో నివసించే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
వాతావరణం శాఖ ఎటువంటి భారీ వర్ష సూచన ప్రకటించకపోవడంతో రైతులు మరియు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
విజయవాడ వరదల నష్టం :
భారీ వర్షాలకు వరదలు ఏర్పడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన విషయం అందరికీ తెలిసిందే. విజయవాడలోని గురమేరు పొంగడంతో వరదలకు విజయవాడ నగరం సగం మునిగింది. బుడమేరు వరదల కారణంగా చాలామంది మృతి చెందారు. అలాగే తీవ్రమైన ఆస్తి నష్టం మరియు పంట నష్టం ఏర్పడింది.
రాష్ట్ర సీఎం చంద్రబాబు సహాయక కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించాడు. వరద బాధితులకు నష్టపరిహారం కింద 25000 పంపిణీ చేశారు. అనేకమంది ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు, వివిధ వ్యాపారవేత్తలు నుంచి సామాన్యులను వరకు సీఎం సహాయ నిధికి దాదాపుగా 400 కోట్ల రూపాయల విరాళాలు అందించారు.