RAIN ALERT : భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం… మధ్య అరేబియా సముద్రమట్టం నుంచి పైకి 3.1 కిలోమీటర్లు ఎత్తువరకు వ్యాపించి ఉంది. మరొక అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22న ఏర్పడనుంది. ఇది వాయువ్య దిశ గా కదులుతూ మరింత బలపడి వాయుగుండం గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు యానాం లలో అక్టోబర్ 19 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అక్టోబర్ 19 weather రిపోర్ట్ ప్రకారం…
శనివారం రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఏపీలో ఉదయం 9 గంటల నుంచి కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. రాత్రి వరకు ఇలాగే కొనసాగుతుంది.ఇంకా తెలంగాణలో సాయంత్రం నాలుగు గంటల తరువాత నుంచి హైదరాబాద్ సహా పలు ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయి. రాత్రి 12:00 వరకు ఇలాగే ఉంటుంది.
గాలి వేగం ఏపీలో గంటకు 7 కిలోమీటర్లు,తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్లు గా ఉంటుంది. గాలి వేగం తక్కువగా ఉండటం వలన వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో తేమ శాతం 80 కంటే ఎక్కువగా ఉంటుంది.అందువల్ల శనివారం రోజు రెండు రాష్ట్రాలలో చాలా చాలా తేలిక పాట నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
One thought on “RAIN ALERT : ఏపీని వెంటాడుతున్న భారీ వర్షాలు”