భారీ వర్షాల కారణంగా మోడీ పూణే పర్యటన రద్దు
న్యూ ఢిల్లీ : మహాహారాష్ట్ర లోని భారీ వర్షాల కారణం గా మోడీ పూణే పర్యటన రద్దయింది. రాష్టం లోని పలు గారాలు భారీ వర్షాలకు అతలాకుతలం అయ్యాయి.రోడ్ల పైకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.
నరేంద్ర మోడీ ఈరోజు పూణే మెట్రో రైలుతో ప్రారంభోత్సవంతో పాటు వివిధ 22,600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది అయితే భారీ వర్షాల కారణంగా నరేంద్ర మోడీ తన పర్యటన రద్దు చేసుకున్నాడు.
భారీ వర్షాల దృష్ట్యా మహారాష్ట్ర పలు కళాశాలలను మూసివేశారు ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది.కుండ పోత వర్షాల కారణంగా గోవండి-మాన్ ఖుర్ద్ మధ్య నడిచే పలు ముంబై లోకల్ ట్రైన్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐ ఎం డి పూణే జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
ప్రజలను అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావద్దని,అత్యవసర పరిస్థితి అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జాతీయ సూపర్ కంప్యూటర్ మిషన్ కింద సుమారు 130 కోట్లతో అభివృద్ధి చేసిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.
అలాగే వాతావరణ పరిశోధనల కోసం తయారు చేసిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ ను కూడా ప్రధానమంత్రి మోడీ ప్రారంభించాల్సి ఉంది ఈ ప్రాజెక్టు కోసం వారు 800 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ భారీ వర్షాల కారణంగా నేడు రద్దయ్యాయి.