PM MODI: సరిహద్దులలో భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికాతో కీలక రక్షణ ఒప్పందం పై సంతకం చేసింది భారత్. అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ ల కొనుగోలు ఒప్పందం పై సంతకం చేసింది. ఈ ఒప్పందం కింద మొత్తం 31 MQ9B డ్రోన్లను కొనుగోలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.వీటికి ప్రత్యేక క్షిపణులు, లేజర్ గైడెడ్ బాంబులను జనరల్ అటానమిక్ సంస్థ సమకూర్చునుంది.
Donald Trump: ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం
మొత్తం 31 డ్రోన్లలో 15 నౌకాదనానికి, 8 సైన్యానికి, మిగిలినవి వాయు సేనకు కేటాయించనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పంద మొత్తం విలువ 3.5 బిలియన్ డాలర్లు. చాలా ఎక్కువ ఎత్తుకు ప్రిడేటర్ డ్రోన్లు 40 గంటల వరకు ఆకాశంలో ఎగర కలవు. 4 ఎల్ ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను తీసుకెళ్లగలవు.
చైనాతో ఉన్న వాస్తవాదిన రేఖ వెంబడి ఉంచేందుకు ఇవి అవసరమని భారత్ భావిస్తోంది. వీటిలో మరో రకమైన సీ గార్డియన్ డ్రోన్లను భారత్ ఇప్పటికే ఉపయోగిస్తుంది