PM Kisan status: రైతుల ఖాతాల్లో 2000 జమ … 18వ విడుత పీఎం కిసాన్

PM Kisan status: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హత పొందిన రైతులకు 18వ విడుత నిధులను విడుదల చేసింది. అర్హత పొందిన రైతులకు 2000 చొప్పున తమ ఖాతాల్లో డబ్బులు అక్టోబర్ 5 న జమ చేసింది.

PM KISAN : కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పెట్టుబడి సాయం కింద 2000 రూ. అందిస్తోంది. అందుకోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ను 2019 లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగింది. అర్హత పొందిన ప్రతి రైతుకు సంవత్సరానికి 6000 రూ. చొప్పున మూడు విడతలుగా 2000 రూ. జమచేస్తూ వచ్చింది.

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం

ఇప్పటివరకు 17 విడతల్లో అర్హులైన రైతులకు తమ ఖాతా లో డబ్బులు జమచేసింది. ఇప్పుడు 18 వ విడుతను అక్టోబర్ 5 2024 న పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనునట్లు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు.

E-KYC తప్పనిసరి:

పీఎం కిసాన్ కింద అర్హత సాధించాలంటే e-kyc తప్పనిసరిగా చేయించాలి. పీఎం కిసాన్ e-KYC ని అధికారిక వెబ్సైటులో OTP పద్దతి ద్వారా చేయవచ్చు. లేదా సమీప CSC కేంద్రాలలో బయోమెట్రిక్ పద్దతి ద్వారా e-KYC ని పూర్తి చేయవచ్చు. అదేవిధంగా పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ పద్దతి ద్వారా మీ e-KYC ని పూర్తి చేయవచ్చు. ఇంకా ఎవరైనా తమ e-KYC పూర్తి చేయకుంటే వెంటనే చేయండి.

One thought on “PM Kisan status: రైతుల ఖాతాల్లో 2000 జమ … 18వ విడుత పీఎం కిసాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *