Nobel Prize 2024: 2024 కు సంబంధించిన నోబెల్ అవార్డులను స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది. సాహిత్య విభాగానికి సంబంధించిన నోబెల్ అవార్డును ప్రకటించింది.
సాహిత్యం లో 2024 నోబెల్ బహుమతి(#NobelPrize) దక్షిణ కొరియా రచయిత హాన్ కాంగ్ కు ” చారిత్రక బాధలను ఎదుర్కొనే మరియు మానవ జీవితంలో ని దుర్బలత్వాన్ని బహిర్గతం చేసే ఆమె కవితా గద్యానికి ” అందించబడింది.
ఇవాళ ఈ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డులను స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఉన్న కరోలిన్ స్కా ఇంస్టిట్యూట్ లోని నోబెల్ బృందం ప్రకటించింది. నోబెల్ అవార్డు గెలుచుకున్నవారికి 10 లక్షల డాలర్లు అంటే ( 11 లక్షల స్వీడిష్ క్రోనర్ లు ) నగదు అందుతుంది.
Nobel Prize 2024: రసాయన శాస్త్రం లో ముగ్గురిని వరించిన నోబెల్ అవార్డు
2024 రసాయన శాస్త్రంలో డేవిడ్ బేకర్ , డేమిస్ హస్సాబిస్ తోపాటు జాన్ ఎం. జంపర్ ను నోబెల్ బహుమతి వరించింది. ప్రోటీన్ల ఆవిష్కరణకు సంబంధించిన సేవలు చేసినందుకుగాను వీరిని వరించింది.
2024 వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ లు మైక్రో ఆర్‌ఎన్‌ఏ , జన్యు నియంత్రణ లో విశేష పరిశోధనలుకు గాను మెడిసిన్ లో నోబెల్ అవార్దు గెలుచుకున్నారని అవార్డు ప్రధాన సంస్థ సోమవారం తెలిపింది.
2024 ఫిజిక్స్ లో విశేష కృషి చేసినందుకు గాను వారికి ఈ అవార్డు దక్కనుంది. జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌లకు ఫిజిక్స్ లో నోబెల్ అవార్డు దక్కింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లతో మిషన్ లెర్నింగ్ ఆవిష్కరించినందుకు వీరికి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది.
శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి , చివరి రోజున అక్టోబర్ 14 న అర్ధశాస్త్రం లో నోబెల్ గ్రహీతల పేర్లను తెలపనున్నారు.
ఆల్‌ఫ్రెడ్ నోబెల్ 1896 లో మరణించాడు. తరువాత స్వీడిష్ డైనమైట్ ఆవిష్కర్త , వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు తో ప్రతి సంవత్సరం ప్రపంచంలో వివిఐద రంగాలలో వినూత్న సేవలందించిన వారికీ 1901 నుంచి నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు.
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 10, 2024
The 2024 #NobelPrize in Literature is awarded to the South Korean author Han Kang “for her intense poetic prose that confronts historical traumas and exposes the fragility of human life.” pic.twitter.com/dAQiXnm11z
3 thoughts on “Nobel Prize 2024 : సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి ని వరించిన నోబెల్ బహుమతి”