Nobel Prize 2024: అర్థశాస్త్రం లో.. ముగ్గురు నోబెల్ విజేతలు

Nobel Prize 2024: 2024 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులను స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది. అందులో భాగంగానే అర్థశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులను ప్రకటించింది. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు దక్కించుకున్నారు. ”  దేశాల మధ్య సంపదలో అసమానతల పై పరిశోధనలకు గాను డారన్ అసెమొగ్లు,సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ లకు ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది.

PM MODI: అమెరికాతో మరో కీలక ఒప్పందం

 ఈ నోబెల్ బహుమతులు పురస్కారం గత సోమవారం వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించగా…తరువాత భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్య విభాగాల్లో నోబెల్ బహుమతులను గెలుపొందిన విజేతల పేర్లను ప్రకటించారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. తాజాగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుపొందిన ముగ్గురు ఆర్థికవేత్తల పేర్లను ప్రకటించారు.

 స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్,  వ్యాపారవేత్త అయినటువంటి ఆల్ ఫ్రెడ్ నోబెల్ పేరు మీదగా ఈ బహుమతులను అందజేస్తున్నారు. ఆల్ ఫ్రెడ్ నోబెల్ 1896లో మరణించగా… 1901 నుంచి ఆయన ట్రస్టు ద్వారా ప్రపంచంలో వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ నోబెల్ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రకటిస్తూ వస్తుంది.అవార్డు గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ నగదు అందుతుంది. డిసెంబర్ 10 నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.

One thought on “Nobel Prize 2024: అర్థశాస్త్రం లో.. ముగ్గురు నోబెల్ విజేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *