NARA ROHIT: తెలుగు నటుడు నారా రోహిత్ త్వరలో పెళ్లి పీట లెక్కనున్నారు. ఇటీవల నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాలో తనకు జోడిగా నటించిన సిరిలెల్లా ను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ ఆదివారం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో వారిని నిశ్చితార్థం వైభవంగా జరిగింది.
Devaragattu: దేవరగట్టు ఉత్సవంలో 80మందికి పైగా గాయాలు
వీరి నిశ్చితార్థం ఉదయం 10:45 కి రోహిత్ – శిరీష ఇలా నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇరువైపులా కుటుంబ పెద్దలు పెళ్లి ముహూర్తాన్ని డిసెంబర్ 15న తేదీన నిర్ణయించారు. నారా రోహిత్ నిశ్చితార్థ వేడుకకు నారా కుటుంబంతో పాటు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా హాజరయ్యారు. అదేవిధంగా అమ్మాయి తరఫున ముఖ్యమైన బంధువులు, పలువురు సినీ తారల సమక్షంలో నారా రోహిత్ – సిరిలెల్లా నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేష్ , కోడలు బ్రాహ్మణి ఇంకా నారా వారి ఫ్యామిలీ అదే విధంగా నందమూరి కుటుంబ సభ్యులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
అయితే ప్రతినిధి2 సినిమాలో నారా రోహిత్ కు జంటగా నటించిన సిరిలెల్లా , వీరిద్దరూ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా జంట కానున్నారు. పెళ్లి విషయంలో చాలా టైం తీసుకున్నాడు ఫైనల్ గా సోలో లైఫ్ చెప్పి శిరీష తో ఏడు అడుగులు వేయనున్నాడు.