ఇరాన్ యొక్క చమురు కేంద్రాలను లక్ష్యం గా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
israel iran war: ఇరాన్ యొక్క చమురు కేంద్రాలను లక్ష్యం గా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయితే, ఇజ్రాయెల్ ఇప్పటికిప్పుడు ఈ దాడులు జరుపుతుందని అనుకోవడం లేదని పేర్కొన్నారు.వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో సమావేశంలో మాట్లాడిన ఆయన … చమురు కేంద్రం పై ఇజ్రాయిల్ దాడులకు మద్దతిస్తారా ? అని జో బైడెన్ ను ప్రశ్నించగా… ఆయన ఈ విధంగా స్పందించారు. జో బైడెన్ వ్యాక్యాల నేపధ్యలో ఇంధన ధరలు 5 శాతం పెరగడం గమనార్హం .
Petrol Prices:పశ్చిమాసియా లో దాడుల కారణంగా … భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా?
ఇజ్రాయిల్ దాడులను మేం ఎప్పటికి అంగీకరించం . ఈ రోజు కూడా అటువంటిది ఏమి ఉండదని ” జో బైడెన్ ” తెలిపారు. అంతేకాదు ఇరాన్ చమురు కేంద్రాలపై దాడి చేయడాన్ని అంగీకరించం. ఇజ్రాయిల్ పై 200 క్షిపణు లతో దాడి జరిపిన ఇరాన్ పై ప్రతీకారం తీసుకుంటామని బెంజిమిన్ నేతన్యాహు స్పష్టం చేశారు.
అయితే ఇరాన్ పై దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు కేంద్రాలను లక్ష్యం గా చేసుకొని దాడులు జరగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా జో బైడెన్ ఇందుకు కొంత క్లారిటీ ఇవ్వడం గమనార్హం.