israel iran war: ఇజ్రాయిల్ పై 200 క్షిపణి దాడులు చేసిన ఇరాన్

israel iran war: పశ్చిమ ఆసియా దేశాలలో ఉద్రిక్తకరంగా పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ దేశంపై క్షపణి దాడులకు దిగింది. లెబనాన్ లోని హెజ్బొల్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న సమయంలో ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. ఇజ్రాయిల్ పై క్షిపణి దాడులతో ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఇజ్రాయిల్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ఇజ్రాయిల్ తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది.

200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్ పై దాడి చేసింది ఇరాన్. జెరూసలేం, టెల్ అవేవ్ ప్రాంతాలలో వరుస పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలిసింది. వరుస దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయిల్ యొక్క రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ వంటి సాంకేతిక వ్యవస్థతో క్షిపణులను దీటుగా ఎదుర్కొన్నట్లు సమాచారం.

ఈ దాడులలో ఇజ్రాయిల్ ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు. తమదేశ పౌరుల ప్రాణాలను రక్షించేందుకు ఇజ్రాయిల్ అన్ని చర్యలు తీసుకుందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇజ్రాయిల్ పై దాడుల తరువాత స్పందించిన ఇరాన్ , మరణించిన హమాస్ అధినేత ఇస్మాయిల్ హనీయా హెజ్బొల్ల చీఫ్ హసన్ నస్రల్ల , నిల్ఫోరూషన్ మరణాలకు ప్రతీకార చర్య గా దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది.

సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ ఖమేనిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఇరాన్ సీనియర్ అధికారి తెలిపారు.

ఇదిలావుంటే, ఇజ్రాయిల్ రాజధానిలో ఒక వ్యక్తి తుపాకులతో కాల్పులు జరపడం తో పలువురు చనిపోయారు.

ఇజ్రాయిల్ పై దాడుల వేళ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయిల్ కు మద్దతుగా నిలిచేందుకు, పశ్చిమ ఆసియా లోని అమెరికా బలగాలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది .

ఈ సమావేశంలో అధ్యక్షుడు జో బైడెన్ , ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాల్గొన్నారు.

One thought on “israel iran war: ఇజ్రాయిల్ పై 200 క్షిపణి దాడులు చేసిన ఇరాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *