IRAN-ISRAEL WAR: ఇజ్రాయిల్ పై 200 క్షిపణులతో ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే, తాము కూడా ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ సైన్యం కూడా ప్రకటించింది. ఇరాన్ పై ఈ దాడులు ఏడు రోజుల్లో జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకు సంబందించిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు IDF వర్గాలు వెల్లడించాయి.
ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమెన్ నెతన్యాహూ వద్దకు దాడికి సంబందించిన ప్రతిపాదనలు చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలను ఇజ్రాయిల్ ప్రధానితో పాటు రక్షణ శాఖ మంత్రి మోవ్ గలాంట్ ఆమోదించవలసి ఉంటుంది.
pm kisan beneficiary status: అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల … లిస్టు లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకొండిలా!
ఇరాన్ యొక్క అణుక్షేత్రాలపై జరపాలా లేక చమురు క్షేత్రాలపై జరపాలా అని ఇజ్రాయిల్ తీవ్రంగా చర్చిస్తోంది. ఇజ్రాయిల్ అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. బైడెన్ యంత్రాంగం ఇజ్రాయిల్ ప్రధాని కి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తోంది.
ఇరాన్ యొక్క చమురు క్షేత్రాలపై దాడులు జారితే , ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ” నేను నెతన్యాహు స్థానంలో ఉంటే చమురు నిక్షేపాలపై కాకుండా ప్రత్యామ్నాయం ఆలోచిస్తాను ” అని బైడెన్ పేర్కొన్నాడు.
2 thoughts on “IRAN-ISRAEL WAR:ఇరాన్ పై దాడులు జరిగే అవకాసం… ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న బైడెన్”