INDIA VS BANGLADESH: సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ … వరుసగా 18వ విజయం కాన్పూర్ వేదికగా జరిగిన చివరి టెస్టు లో ఇండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ టెస్టు కు వరుణుడు కొంత అడ్డంకిగా మారాడు. తొలి రోజు కేవలం 35 ఓవర్లు ఆట మాత్రమే ఆడగలిగారు. రెండు, మూడు రోజుల ఆటకు వరుణుడు అడ్డుపడడం వలన రెండు, మూడు రోజుల ఆట రద్దయింది. ఈ సమయం లో అందరు మ్యాచ్ డ్రా గా ముగుస్తుందని అంతా అనుకున్నారు.
AP CRIME NEWS: వీఆర్ఏ ప్రాణాన్ని బలి తీసిన వివాహేతర సంబంధం
కానీ భారత్ అసాధ్యం అనుకున్న గెలుపు ను సుసాధ్యం చేసింది. రెండు ఇన్నింగ్స్ లలో ను బాంగ్లాదేశ్ ను ఆలౌట్ చేసింది. అప్పటికి విజయలక్ష్యం కేవలం 95 పరుగులు ఉంది. స్వల్ప లక్ష్యం తో బరిలోకి దిగిన భారత్ మూడు వికెట్లు నష్టపోయి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఓపెనర్ రోహిత్ శర్మ (8) గిల్ (6) లు విఫలమైన యశస్వి జైస్వాల్ (51) , విరాట్ కోహ్లి 29* పరుగులతో ఆకట్టుకున్నారు.
51 పరుగులు చేసిన జైస్వాల్ తన ఖాతాలో మరొక హాఫ్ సెంచరీ ని వేసుకున్నాడు. భారీ షాట్ కి ప్రయత్నించి జైస్వాల్ అవుట్ అయ్యాడు. విజయానికి మూడు పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. తరవాత భరిలోకి వచ్చిన పంత్ (4*) తో కలిసి విరాట్ కోహ్లి మరొక వికెట్ కోల్పోకుండా విజయ తీరాలకు చేర్చాడు.
బాంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకు అలౌట్ అయ్యింది. బాంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు అలౌట్ అయ్యింది . తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడిన భారత్ 285/9 వద్ద డిక్లేర్ చేసింది.
రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ గెలుపుతో సొంత గడ్డ లో 18 వ సిరీస్ గెలిచినట్లు. యశస్వి జైస్వాల్ ” ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” కాగా, ” ప్లేయర్ ఆఫ్ ద సిరీస్” గా జడేజా అవార్డు ను అందుకున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ పట్టిక లో ఈ సిరీస్ గెలుపు తో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అయితే జరగబోయే 8 టెస్టుల్లో 3 గెలిచినా టాప్ 2 లో ఉండి, ఫైనల్ కు చేరుతుంది.