IND VS NZ : బెంగళూరు వేదికగా ఇండియా న్యూజిలాండ్ తొలి టెస్ట్ జరుగుతుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటర్లతో సహా బౌలర్లు కూడా పూర్తిగా విఫలం అయ్యారు.
తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన న్యూజిలాండ్ 402 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర సెంచరీ (134) తో మెరిశాడు. అతనికి తోడుగా టిమ్ సౌదీ కూడా 65 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే జడేజా కుల్దీప్ యాదవ్ లు 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, అశ్విన్, బూమ్రా తలోవికెట్టు తీశారు.
అయితే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై 37 ఏళ్లు గడిచాయి. చివరిసారిగా 1987లో స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని చవిచూసింది. చాలా ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ చేతిలో ఓటమి తప్పేలాలేదు. బెంగళూరు పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండడంతో.. క్రీస్ లోకి వచ్చే ప్రతి బ్యాటర్ కూడా భారీ స్కోరు చేసే సత్తా ఉండడంతో ఏదో అద్భుతం జరుగుతుందని, అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
అదే అద్భుతానికి నాంది పలుకుతూ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ వన్డే తరహాలో బ్యాటింగ్ మొదలుపెట్టింది. జైస్వాల్ 35 పరుగులు, రోహిత్ శర్మ 52 పరుగులు, విరాట్ కోహ్లీ 70 పరుగులు చేసి వెనుతిరిగారు.
సర్ఫరాజ్ ఖాన్ (125* ) సెంచరీ, పంత్ అర్ధశతకం (52*)
ప్రస్తుతం : ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ న్యూజిలాండ్ బౌలర్లను దాటిగా ఎదుర్కొంటూ భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీని (125 నాటౌట్ ) పూర్తి చేశాడు. రిషబ్ పంత్ కూడా తన అద్భుతమైన బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ(53 నాటౌట్) పూర్తి చేశాడు. ప్రస్తుతం 12 పరుగుల ఆదిక్యంలో భారత్ ఉంది.
బెంగళూరు పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తూ ఉండడంతో భారత్ కనీసం 200 పైన ఆదిక్యాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. లేకపోతే బౌలర్లు కూడా పెద్దగా చేయగలిగేది ఏమీ లేదు.