IND VS NZ: న్యూజిలాండ్ సిరీస్ కు జట్టు ప్రకటన… వైస్ కెప్టెన్ గా బుమ్రా

బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టర్ సిరీస్ కి కూడా వైస్ కెప్టెన్ గా ఎవరిని సెలెక్ట్ చేయలేదు. త్వరలో టీమిండియా పర్యటన చేయనున్న నేపథ్యంలో పెర్త్ లో జరిగే తొలి టెస్ట్ కు కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ కు ముందుగానే వైస్ కెప్టెన్ గా బుమ్రాను సెలెక్ట్ చేశారు.

గతంలోనూ ఒక టెస్ట్ మ్యాచ్ కు భారత కెప్టెన్ గా బుమ్రా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ సిరీస్ కు ఎంపిక చేసిన 16 సభ్యులలో ఒకే ఒక్క మార్పుతో మాత్రమే న్యూజిలాండ్ సిరీస్ కు జట్టును ప్రకటించడం విశేషం. పేసర్ యశ్ దయాళ్ ను జట్టు నుండి తొలగించి మిగతా 15 మంది ఆటగాళ్లలో యధావిధిగా న్యూజిలాండ్ సిరీస్ కు ప్రకటించారు. అయితే ఆ 15 మంది ఆటగాళ్లలో ఎలాంటి మార్పు లేదు.

సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంకా గాయం నుండి కోలుకోనట్లు సమాచారం. అయితే తొలి టెస్ట్ ఈనెల 16 నుంచి బెంగళూరులో జరగనుంది.

జట్టు: రోహిత్ శర్మ ( కెప్టెన్), జస్ ప్రీత్ బుమ్రాన్(వైస్ కెప్టెన్) , యశస్వి జైస్వాల్, గిల్, విరాట్ కోహ్లీ, రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, పంత్, జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, ఆకాష్ దీప్,

రిజర్వ్ ఆటగాళ్ళు: నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ, మాయాంకి యాదవ్, హర్షిత్ రానా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *