IND VS BAN : రెండో TEST లో ఆ ముగ్గురు ఆటగాళ్ళకు చోటులేదు.
IND VS BAN : బాంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ భాగంగా చెన్నై వేదిక జరిగిన తొలి టెస్ట్ లో భారత్ 280 పరుగులతో ఘనవిజయం నమోదు చేసింది. అదే జోరులో రెండో టెస్టులో కూడా విజయం నమోదు చేసి బాంగ్లాదేశ్ ని క్లీన్ స్వీప్ చేయాలనే ఉత్సహంతో భారత్ ఉంది.
కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే భారత జట్టు నుంచి సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ , యశ్ దయాల్ ను రిలీజ్ చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది.ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇరానీ ట్రోఫీ ఆడే జట్లలో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. సర్ఫరాజ్ ఖాన్ రంజీ చాంపియన్ ముంబై జట్టులో ఉండగా , ధృవ్ జురెల్ , యశ్ దయాల్ రెస్టాఫ్ ఇండియాకు ఎంపికయ్యారు.
ఇరానీ ట్రోఫీ చెట్లను ప్రకటించిన బీసీసీఐ ఈ ముగ్గురు ఆటగాళ్ల గురించి బీసీసీ స్పష్టంగా వివరించండి.బంగ్లాదేశ్ తో జరిగే ఆఖరి టెస్టు కు ఎంపిక అవ్వకపోతే, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇరానీ ట్రోఫీ ఆడతారని తెలిపింది. అయితే ఈ ముగ్గురు ఆటగాళ్లు తుది జట్టులో ఎంపిక అవకప్పడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. కేఎల్ రాహుల్ ఫామ్ లో ఉండటం అలాగే రిషబ్ పంత్ తిరిగి రావడంతో సర్ఫరాజ్ ఖాన్ మరియు ధృవ్ జురెల్ కు నిరాశ .వీరికి తొలి టెస్టులో కూడా చోటు దక్కలేదు.
ఆఖరి టెస్ట్ వేదిక అయిన కాన్పూర్ పిచ్ స్పిన్ కి ఎక్కువ అనుకూలిస్తుంది. కాబట్టి భారత్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగడానికి అవకాశాలున్నాయి. మొదటి ఆప్షన్ గ బుమ్రా, సిరాజ్ ను తీసుకోవచ్చు. ఒక వేళా వీరిలో ఒకరికి రెస్ట్ ఇవ్వాలి, అని భావిస్తే ఆకాశ్ దీప్ ను తుదిజట్టు లోకి ఎంపిక చేయవచ్చు. తొలి టెస్ట్ లో చోటు సంపాదించుకున్న యాష్ దయాల్ కి రెండో టెస్ట్ లో నిరాశే మిగులుతుంది.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఎంపికైన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
2 thoughts on “IND VS BAN : రెండో TEST లో ఆ ముగ్గురు ఆటగాళ్ళకు చోటులేదు.”