ICC Test Ranks: మెరుగుపడిన యశస్వి, పంత్ ర్యాంక్స్, దిగజారిన రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి ర్యాంక్స్.
IND VS BAN: బంగ్లాదేశ్, భారత్ మధ్య జరుగు టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతుంది. రెండో టెస్టు రెండో రోజు ఆటకు మరోసారి వర్షం దెబ్బ పడింది. బంతి కూడా వేయకుండానే రెండో రోజు ఆట రద్దయింది.
రెండో టెస్టులో కూడా గెలిచి బంగ్లాదేశ్ ను క్లీన్ స్వీట్ చేయాలని భారత్ తహతహలాడుతుంది. దానికి వరణుడు అద్దంకిగా మారాడు. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి పై ఐదు ఓవర్లు మాత్రమే సాధ్యం కాక రెండో రోజు అనగా సెప్టెంబర్ 28 మొత్తం ఒక బంతి వేయకుండానే వర్షం కారణంగా రద్దయింది. ఆ వివరాలు ఇవే …
ind vs ban : రెండో రోజు ఒక్క బంతి పడకుండానే ఆట రద్దు…
రెండవ రోజు అనగా శనివారం ఉదయం నుంచి కాన్పూర్ స్టేడియం వద్ద వర్షం పడింది. వర్షం రేపు కొనసాగడంతో మైదానంలోని కవర్లపై నీరు నిలిచింది . మొదట తక్కువగా పడిన ఆ తరువాత వర్షం జోరు అందుకుంది.
వాన భారీగా పడడంతో గ్రీన్ పార్క్ స్టేడియం చిత్తడిగా మారింది . వాన ఆగిపోవడంతో ఎంపైర్లు పలుమార్లు ఇన్స్పెక్షన్ చేశారు. మైదానం అప్పటికే బురద గా మారడంతో స్టేడియం సిబ్బంది ఎంత కష్టపడినా పరిస్థితి మెరుగుపడలేదు, చివరికి ఎంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు .
రేపటి వాతావరణం ఇలా …
భారత్, బంగ్లాదేశ్ చివరి టెస్టు మూడో రోజైనా రేపు అనగా సెప్టెంబర్ 29 కూడా వర్షం ఆటంకం తప్పేలా లేదు . వెదర్ రిపోర్ట్ ప్రకారం కాన్పూర్ లో అవకాశాలు 59% ఉన్నాయి . కాన్పూర్ లో ఉదయం వర్షం పడే అవకాశాలు ఉన్నారు . రేపు వాతావరణం లో గాలి శాతం కూడా 80% వరకు ఉంటుందని తెలిపింది. మొత్తంగా మూడవరోజు ఆటకు వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవ రోజు కంటే మూడవరోజు పరిస్థితి మెరుగ్గా ఉండొచ్చు. మూడవరోజు మధ్యాహ్నం వర్షం పడే అవకాశాలు 25% మాత్రమే ఉన్నాయి. దీంతో మూడవరోజు ఆటా రద్దు అవక పోవచ్చు అని అంచనా వేస్తున్నారు.
స్కోరు వివరాలు :
బంగ్లాదేశ్ భారత మధ్య చివరి టెస్ట్ తొలి రోజు 35 ఓవర్లకు ఆట మాత్రమే సాధ్యమై ంది వాన మరియు వెలుతురు సరిగా లేని కారణంగా తొలిరోజు ఆట త్వరగా ముగిసింది . ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది . మోమినుల్ హక్ ( 40 నాటౌట్ ) ముష్ఫికర్ రహీం (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ రెండు వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశారు ఒక బంతి కూడా వేయకుండానే పెద్దయింది . మూడవరోజు వరుణుడు ఏ మాత్రం సహకరిస్తాడో చూడాలి.
మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. అలాగే చివరి టెస్టులో కూడా విజయాన్ని నమోదు చేసి బంగ్లాదేశ్ ని చిత్తుగా ఓడించి సిరీస్ ని క్లీన్‍స్వీప్ చేయాలని భారత్ ఎదురుచూస్తుంది.