Ind vs Ban 3rd T20: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరుగుతుంది. టీం ఇండియా మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా రెండో టి20 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది టీమిండియా. టి 20 క్రికెట్ లో తన ఖాతాలో మరొక్క సిరీస్ ను వేసుకుంది భారత జట్టు.
Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కే… ఓటేసిన జులానా ప్రజలు
హైదరాబాద్ వేదికగా నామమాత్రపు మూడవ టి20 శనివారం జరగనుంది. ఈ మ్యాచ్ లో పలు ప్రయోగాలు చేయడానికి భారత జట్టు మేనేజ్మెంట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా తుదిచెట్టులో కూడా పలు మార్పులు చేయనున్నట్లు సమాచారం.
ఆఖరి t20 మ్యాచ్ లో పెసర్ హర్షిత్ రానా భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా రెండో టి20 మ్యాచ్ లో బెంచ్ కే పరిమితమైన తిలక్ వర్మ, రవి బిస్నోయ్ కూడా ఆఖరి t20 లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పెసర్ మయాంక్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లకు ఆఖరి మ్యాచ్ లో విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్ లో పేర్కొన్నాయి.