IND VS BAN : నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి…
భారత్, బంగ్లాదేశ్ ( IND VS BAN ) మధ్య జరుగుతున్న చివరి టెస్టు ఆట ఆసక్తి మారింది. వర్షం కారణంగా రెండు, మూడవ రోజు ఆట రద్దయింది. అయితే నాలుగవ రోజు ఆట కు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. నాలుగవ రోజు ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు వెనుక బడింది. క్రీజులో షాద్మాన్ 7* పరుగులు, మోమినుల్ హక్ 0* పరుగులతో ఉన్నారు.నాలుగవ రోజు ఆటను 107/3 పరుగులతో ప్రారంభించిన బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ 233/10 ముగించింది.లంచ్ బ్రేక్ టైం కు బంగ్లాదేశ్ 205/6 పరుగులు చేసింది. అయితే రెండో సెషన్ లో మిగిలిన 4 వికెట్లు కోల్పోయి 28 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బంగ్లాదేశ్ బ్యాటింగ్:
బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో మోమినుల్ హక్( 107 ) సెంచరీ ఆకట్టుకున్నాడు. అలాగే నజ్మల్ హోస్సెన్ శాంటో (31), మొహిది హసన్ మిరాజ్ (20) పరుగులు చేశారు.భారత బౌలింగ్ లో బుమ్రా 3, సిరాజ్, ఆకాశ్ దీప్, అశ్విన్ లకు రెండేసి వికెట్లు, జడేజా కు 1 వికెట్ లభించింది.
భారత ధనా ధన్ బ్యాటింగ్:
మొదటి ఇన్నింగ్స్ ని ఆరంభించిన భారత్ మొదటి నుంచే దూకుడు గా ఆడింది. మ్యాచ్ నీ T20 లాగా ఆడుతూ స్కోర్ బోర్డు నీ పరుగులు పెట్టించారు. ఓపెనర్లు జైస్వాల్ ( 72 పరుగులు 51 బంతుల్లో) , రోహిత్ శర్మ ( 23 పరుగులు 11 బంతుల్లో) ధనా ధన్ బ్యాటింగ్ చేయడంతో కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేసింది.
శుభ్ మన్ గిల్ 39 పరుగులు చేయగా, పంత్ 9 పరుగులతో నిరాసపరిచాడు.ఇక విరాట్ కోహ్లి 47 పరుగులతో, రాహుల్ 68 పరుగులతో ధనా ధన్ బ్యాటింగ్ తో అలరించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మీరాజ్ 4/41 , షకీబ్ అల్ హస్సన్ 4/78 సత్తాచాటారు.అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు 5 ప్రపంచ రికార్డులను నమోదు చేయండి.
టెస్ట్ క్రికెట్ చిత్రలోనే మొదటి సారిగా వేగంగా 50,100,150,200,250 పరుగులు పూర్తి చేసిన ఏకైక జట్టు గా రికార్డు సృష్టించింది.
One thought on “IND VS BAN : నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి… ఒక్క రోజే 18 వికెట్లు”