HEAVY RAIN IN AP: ఏపీకి వాన గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని. విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యాయి. ప్రకాశం జిల్లాలో సగటున 19.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఒంగోలులో అత్యధికంగా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Heavy Rain: ఏపికి భారీవర్షాలు
బాపట్ల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పర్చూరు లో భారీ వర్షాలకు పూసపాడు వద్ద ఉన్న కప్పల వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో పర్చూరు, ఇంకొల్లు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సర్వేపల్లి నియోజకవర్గం లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సముద్రం మల్ల కల్లోలంగా ఉండడంతో మధ్యకారులు ఎవరు వేటకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ముప్పు ప్రాంతాలకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ,చిత్తూరు జిల్లాలలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు.
One thought on “HEAVY RAIN: ఏపికి వాన ముప్పు”