Hassan Nasrallah : ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హస్సన్ నస్రల్లా మృతి

ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హస్సన్ నస్రల్లా (Hassan Nasrallah) మృతి

హిజ్బుల్ల చీఫ్ నస్రల్ల ఇక ప్రపంచాన్ని ఉగ్రవాదం తో భయభ్రాంతులకు గురిచేయలేదంటూ “ఎక్స్ ” వేదికగా ఇజ్రాయిల్ రక్షణ శాఖ తన ఖాతాలో పోస్ట్ చేసింది.

ఆపరేషన్ న్యూ ఆర్డర్ మిషన్ విజయవంతంగా మిగిసిందని ప్రకటించింది.

జెరూసలేం : లెబనాన్ (Lebanon) రాజదాని అయిన బీరూట్ లోని హిజ్బుల్ల కార్యాలయం పై ఇజ్రాయిల్ చేసిన బాంబు దాడుల్లో హిజ్బుల్ల అధినేత హస్సన్ నస్రల్ల (Hassan Nasrallah) మరణించినట్లు ఇజ్రాయిల్ రక్షణ శాఖ ప్రకటించింది.

 హిజ్బుల్ల చీఫ్ నస్రల్ల ఇక ప్రపంచాన్ని ఉగ్రవాదం తో భయభ్రాంతులకు గురిచేయలేదంటూ “ఎక్స్ ” వేదికగా ఇజ్రాయిల్ రక్షణ శాఖ తన ఖాతాలో పోస్ట్ చేసింది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ మిషన్ విజయవంతంగా మిగిసిందని ఇజ్రాయిల్ వార్ రూమ్ కూడా తెలిపింది.

కానీ హిజ్బుల్ల మిలిటెంట్ గ్రూప్ ఈ బాంబు దాడుల్లో తమ నాయకుడు హస్సన్ నస్రల్ల మరణించడాన్న వార్తను ద్రువికరించలేదు. అయితే ఆయన శుక్రవారం రాత్రి నుంచి తమతో కాంటాక్ట్ లో లేరని అయన గురించి ఎటువంటి సమాచారం తమకు తెలియదని పేర్కొన్నారు.

హిజ్బుల్ల లక్ష్యాలపై ఇజ్రాయిల్కురిపిస్తున్న బాంబు ల వర్షం శుక్రవారం నుంచి శనివారం తెల్లవారి జామువరకు కొనసాగింది.

హిజ్బుల్ల పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయిల్ ప్రదాని బెంజిమన్ నెతన్యుహూ ఐక్యరాజ్యసమితి లో ప్రకటించిన కొద్ది సమయానికే ఈ దాడులు మొదలయ్యాయి.

ఈ వారం లెబనాన్ పై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో మృతుల సంఖ్య 720 కి చేరిందని లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.ఈ ఘటనల నేపధ్యంలో దక్షిణ లెబనాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిన వారి సంఖ్య 2,11,000 అని ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక లో ప్రకటింది.

One thought on “Hassan Nasrallah : ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హస్సన్ నస్రల్లా మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *