hamas israel war: ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య భయంకర యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయిల్ చేస్తున్న వరుస బాంబు దాడులలో పాలస్తీనా పౌరుల ప్రాణాలు బలవుతున్నాయి. ఇజ్రాయిల్ తాజాగా గాజాలో నీ జెబాలియా లోని శరణార్థ శిబిరం పై చేసిన దాడులలో 29 మంది పాలస్తీనా పౌరులు మరణించారు.
Nobel Prize 2024: జపాన్ నిహాన్ హిడాంకియో సంస్థ కు నోబెల్ శాంతి బహుమతి
ఇజ్రాయిల్ జరిపిన ఈ దాడులలో వేలాది మంది శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారం రోజులుగా ఇజ్రాయిల్ జెబాలియా ప్రాంతం లో జరుపుతున్న దాడులలో 150 మంది మరణించినట్లు పేర్కొన్నారు.
సురక్షితం అనుకున్న ప్రాంతాలను లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఇప్పటి వరకు ఇజ్రాయిల్ పాలస్తీనా పై జరిపిన దాడుల్లో 42 వేల మంది పాలస్తీనీయన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే, తమ బలగాలు గత 24 గంటల్లో గాజా స్ట్రిప్ వెంబడి సుమారు 40 లక్ష్యాలను చేదించాయని , డజన్ల కొద్ది ఉగ్రవాదులు మరణించాడని ఇజ్రాయిల్ ఆర్మీ పేర్కొంది. అక్టోబర్ 7న 2023 న హమాస్ దక్షిణ ఇజ్రాయిల్ పై జరిపిన దాడుల్లో 1200 మందికి పైగా మరణించారు. 250 మందిని తమతో బందీలుగా తీసుకెళ్ళింది హమాస్. దీంతో ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు చేయడం మొదలు పెట్టింది.
ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 42.227 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
One thought on “hamas israel war: ఇజ్రాయిల్ దాడిలో 29 మంది మృతి”