guntur : గుంటూరు లో దారుణం.. కనిపించకుండాపోయిన యువతి.. కొన్నిగంటల్లోనే బ్రెయిన్‌ డెడ్‌తో ఆసుపత్రిలో..!

Guntur

guntur: గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తెనాలికి చెందిన మధిర సహాన అనే యువత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వల్లభాపురానికి చెందిన నవీన్ అనే రౌడీషీటర్ నిన్న సాయంత్రం ఆమెను కారు తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న యువతిని తెనాలిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాడు. అనంతరం బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి నవీన్… అక్కడి నుండి పరారయ్యాడు. తమ కూతురికి ఏం జరిగిందో తెలియని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వైద్యులు చెప్పిన విషయంపై వారు కన్నీటిపర్యంతం అయ్యారు.

Badvel : పెట్రోల్ దాడికి గురైన మైనర్ విద్యార్థిని మృతి…

 సహానాకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. తాము ఏమీ చేయలేము అని డాక్టర్లు చెప్పడంతో ఎలాగైనా తమ కుమార్తెను బ్రతికించుకునేందుకు, పలు ఆసుపత్రుల చుట్టూ యువతి తల్లిదండ్రులు తిరిగారు. డాక్టర్లందరూ తాము ఏమి చేయలేమని చేతులెత్తేయడంతో తెనాలిలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చివరికి గుంటూరు జీజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

 ఈ ఘటనపై సహనా కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని, నిందితుడైన రౌడీషీటర్ నవీన్ ను కఠినంగా శిక్షించాలని  పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నవీన్ యువతని ఎక్కడికి తీసుకువెళ్లాడు, ఏం చేశాడు, ఆమెకు ఎందుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. నిందితుడు నవీన్ పై ఇప్పటికే రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *