Gaza:ఉత్తర గాజాలో 73 మంది మృతి

Israeli Strikes

Gaza: ఉత్తర గాజా మరొక్కసారి రక్తసిక్తమైంది. ఉత్తర గాజాలోని బెత్ లాహియా నగరంపై శనివారం ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులలో 73 మంది పౌరులు మృతి చెందారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలిపింది. బెత్ లాహియా లో పౌరులు నివాసం ఉండే భవనాలపై ఇజ్రాయిల్ దాడి చేసిన పేర్కొంది.

 ఇక ఇజ్రాయిల్ కూడా దాడి జరిగిన మాట వాస్తవమే.. కానీ.. పాలస్తీని ఆరోగ్య శాఖ చెబుతున్న సంఖ్య నమ్మశక్యంగా లేదని ఇజ్రాయిల్ తెలిపింది. క్షతగాత్రులను తాము కూడా పరిశీలిస్తున్నామని, తమ సైన్యం వద్దనున్న సమాచారంతో సరిపోవటం లేదని ఇజ్రాయిల్ పేర్కొంది. గాజా, లెబనాన్ లోని 175 టెర్రరిస్ట్ టార్గెట్ల పై వైమానిక దళం దాడులు చేసిందని ఇజ్రాయెల్ తెలిపింది.  

 ఆదివారం ఉదయం బీరుట్ లోని హెజ్బుల్ల సెంట్రల్ కమాండ్ సెంటర్ పై ఇజ్రాయిల్ దాడి చేసి ధ్వంసం చేసింది.  అలాగే, అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆయుధ కర్మాకారాన్ని నాశనం చేసింది ఇజ్రాయిల్. దాడులకు  ప్రాంతాలను ఖాళీ చేయాలని హెచ్చరించినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది.  

బీరుట్లో తమ సెంట్రల్ కమాండ్ సెంటర్, ఆయుధ కర్మగారం పై జరిగిన దాడికి ప్రతీకారంగా హెజ్బుల్ల సుమారు 160 రాకెట్లతో ఉత్తర ఇజ్రాయిల్ పై ఆదివారం మధ్యాహ్నం దాడి చేసింది. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఇజ్రాయిల్ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *