Election commission: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తేది విడుదల

Election commission: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మహారాష్ట్రంలో ఒక దశలో, జార్ఖండ్ రెండు దశలలో ఎన్నికలు జరపనున్నట్లు తెలిపారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తంగా 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 4.97 కోట్లు , అలాగే మహిళా ఓటర్లు 4.66 కోట్లు ఉన్నారు. 

AP HEAVY RAINS: భారీ వర్షాలకు ప్రకాశం, బాపట్ల జలమయం

ఇందులో 20.93 లక్షల మంది ఓటర్లు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం 1,00,186 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని అర్బన్ ఓటర్లకు ప్రత్యేకంగా పిలుపునిచ్చింది.

అదే విధంగా జార్ఖండ్ లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరపనుంది ఎన్నికల సంఘం. నవంబర్ 13న 43 స్థానాలకు అదే విధంగా నవంబర్ 20న 38 స్థానాలకు పోలింగ్ జరపనుంది ఎన్నికల సంఘం. 

జార్ఖండ్ లో మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 11.84 లక్షల మంది ఓటర్లు మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

రెండు రాష్ట్రాలలో నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లోక్ సభ 48 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్ సభ నియోజకవర్గంలో పాటు 16 రాష్ట్రాలలోని 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్ లోక్ సభ తో పాటు 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13 న, నాందేడ్ లోక్ సభ సీటుతో పాటు ఉత్తరాఖండ్ లోని ఒక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 20న పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. నవంబర్ 23 ఫలితాలు వెలువడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *