Attack on Donald Trump: అమెరికా అధ్యక్షుడు అభ్యర్థులపై వరుస హత్యాయత్నాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మాజీ అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డోనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం సంచలనాన్ని సృష్టించింది. కాలిఫోర్నియా లోని కోచల్లా లో నిర్వహించిన ర్యాలీలో ఓ వ్యక్తి రెండు గన్నులతో తిరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని సీక్రెట్ సర్వీసెస్ పేర్కొన్నాయి.
hamas israel war: ఇజ్రాయిల్ దాడిలో 29 మంది మృతి
వేదికకు సమీపంలో లోడ్ చేసిన షార్ట్ గన్, హ్యాండ్ గన్ లతో సంచరిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించాయి. నిందితుడిని లాస్ వేగాస్ కు చెందిన వేమ్ మిల్లర్ గా గుర్తించారు పోలీసులు. నకిలీ ప్రెస్ కార్డ్, ఎంట్రీ ప్రాసులతో ర్యాలీకి వచ్చినట్లు గుర్తించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే మితవాద సంస్థలో నిందితుడు సభ్యుడుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రివర్ సైడ్ కౌంటీ షరీప్ డిపార్ట్మెంట్ తెలిసిన వివరాల ప్రకారం… నిందితుడు శనివారమే జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చినట్లు తెలిపారు. అతని వాహనానికి కూడా రిజిస్ట్రేషన్ లేదు. అంతేకాదు అతని వద్ద నకిలీ పాస్ పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్ సైతం ఉండడంతో హత్య జరిగిన అనంతరం విదేశాలకు పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఆరోపాలను ఖండించిన నిందితుడు మిల్లర్… తాను ట్రంప్ మద్దతు దారుడినని, తన వద్ద ఉన్న ఆయుధాలను 2022లో వ్యక్తిగత రక్షణ కోసం కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడు.
అమెరికా అధ్యక్షుడు బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. జులై 13న పెన్సిల్వేనియా లో నిర్వహించిన సభలో థామస్ మాథ్యూ క్రూస్ అనే యువకుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పులలో ట్రంప్ కుడి చెవికి గాయం అయింది. సెప్టెంబర్ 15 న ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లో గోల్ఫ్ ఆడుతుండగా డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం చోటు చేసుకుంది. ఫెన్సింగ్ నుంచి నిందితుడు ఆయుధాలతో రావడాన్ని గమనించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపారు.
అటు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయినా కమలహారీన్ కార్యాలయం పైన కూడా కాల్పులు జరిగాయి. అరిజోనా లోని కమలహరిస్ ప్రచార కార్యాలయం పై నెల రోజుల్లో మూడుసార్లు కాల్పులు జరిగాయి. చివరిగా అక్టోబర్ 6 న కాల్పులు జరగడం తో పార్టీ కార్యాలయాన్ని మూసి వేశారు. దీంతో ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు అత్యంత ఆందోళనకరంగా మారాయి.
One thought on “Donald Trump: ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం”