Devaragattu: దేవరగట్టు ఉత్సవంలో 80మందికి పైగా గాయాలు

DEVARAGATTU

WEATHER UPDATE: ఏపీ లో 14,15,16, తేదిలో భారీ వర్షాలు

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో సుమారు 80 మందికి పైగా గాయాలు అవ్వగా 5 గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో నిప్పురవ్వలు పడడం వలన మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారందరినీ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు సెక్యూరిటీ అధికారులు తెలిపారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కూడా ఈ సంవత్సరం చాలామంది భక్తులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు .

దేవరగట్టులో కొలువు తీరిన మాలమ్మ మల్లేశ్వరుని కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కొండపైకి తీసుకొని వెళ్లి, ఆలయ నిర్వాహక గ్రామాలైన నేరనికి, నేరనికి తండా, కొత్తపేట గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకొని ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకుంటారు. అర్ధరాత్రి 12 గంటలకు జరిగే ఈ ఉత్సవంలో ప్రతి ఏటా చాలామంది గాయాల పాలవుతున్న వారి పట్ల నిరసనలు వస్తున్న, ఈ ఉత్సవము మాత్రం ఆగకుండా కొనసాగుతూ ఉంది.

One thought on “Devaragattu: దేవరగట్టు ఉత్సవంలో 80మందికి పైగా గాయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *