కట్టుకున్న భార్య కోసం ఏకంగా ఐలాండ్ కొనేసిన దుబాయ్ భర్త
Devara Movie Review: ‘దేవర’ మూవీ రివ్యూ ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఎలా ఉందంటే
Jr.NTR అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన దేవర మూవీ కి తెరపడింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన దేవర PART-1 ఇవాళ అనగా సెప్టెంబర్ 27 న విడుదలయ్యింది. ఎన్టీఆర్ కి జతగా ఈ సినిమాలో శ్రీ దేవి కూతురు జాన్వికపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన దేవర PART-1 చిత్రం. DEVARA MOVIE REVIEW IN TELUGU.
కథ :
ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతం. సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఓ కొండపై ఉన్న 4 ఊర్లను కలిపి ‘ఎర్ర సముద్రం.’ అని పిలుచుకుంటారు. ఎర్ర సముద్రం పేరు వెనుక బ్రిటిష్ కాలం నాటి చరిత్ర ఉంది. అక్కడ దేవర (JR.NTR) తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్ ), రాయప్ప (శ్రీకాంత్ ), కుంజర (షైన్ టామ్ చాకో ) ఒక్కోగ్రామ పెద్దలుగా ఉంటారు. ఆ 4 గ్రామాల ప్రజలకు సముద్రమే జీవనాధారం. కొన్ని సరుకులు కోస్ట్ గార్డ్ కి తెలియకుండా సముద్ర మార్గం ద్వారా దించుతుంటారు. అలా తన వాళ్ళ కోసం ఎంతవరకు అయినా వెళ్లి, ప్రాణాలను ఇచ్చేంత ధైర్యవంతుడు దేవరకు ఉంటుంది. అదే ఊళ్ళో ఉన్న భైరాకు (సైఫ్ అలీ ఖాన్ ) దేవర చేసే పనులు నచ్చవు. కానీ దేవర సాయం లేకుండా ఏం చేయలేం అని భైరాకు తెలుసు.అందుకే అదును కోసం చూస్తుంటాడు.
దేవర తన వారైనా రాయప్ప , భైరవ,కుంజర తో కలిసి పెద్ద షిప్స్ ల నుంచి మురుగా కోసం దొంగతనాలు చేస్తుంటారు. అలాంటి దేవర ఒక దొంగతనం చేస్తున్న సమయంలో తన మనసు మార్చుకొని ఇక దొంగతనాలు చేయకూడదని నిర్ణయించుకుంటాడు.
అలా ఓ సమయంలో సముద్రానికి ఎదురెళ్లి ఒడ్డుకు ఆ ఆయుధాలు తమకే ముప్పు అని గ్రహించిన దేవర….తాము చేసేది తప్పు అని తన వాళ్ళను కూడా సముయ్ద్రం ప్పైకి వెళ్లకూడని హెచ్చరిస్తాడు. ఇకపై అటువంటి పనులు చేయకుడదనే నిర్ణయిస్తాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, చేపల పట్టడం మొదలు పెడదామని చెబుతాడు. అందుకు భైర మాత్రం ఒప్పుకోడు. దీంతో దేవర,భైర మధ్య విభేదాలు మొదలవుతాయి. దేవర ను చంపాలని భైర ప్లాన్ వేస్తాడు.
గ్రామ ప్రజలు దేవర మాటను కాదని భైరతో పాటు డబ్బులకు అలవాటుపడిన గ్రామాల ప్రజలు సముద్రం ఎక్కాలని సిద్ధం అవుతారు. వాళ్లకి దేవర తీవ్రమైన భయాన్ని పరిచయం చేస్తాడు. వాళ్ళు ఆ భయంతో తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలంటేనే భయపడుతుంటారు. అంతలా భయపెట్టేందుకు దేవర ఒక నిర్ణయంతీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏమిటి? దేవర అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అతని కొడుకు వర (JR.NTR) ఎందుకు పిరికివాడిగా మారుతాడు? అటువంటి వరని ఇష్టపడుతున్న తంగం (జాన్వీ కపూర్ ) ఎవరు? దేవర,భైర గొడవ ఏ పరిస్థితులకు దారి తీస్తాయి. వర పాత్ర ఏమౌతుంది?పోలీసులకి శివంకి యతి అనే గ్యాంగ్ స్టార్ దొరికాడా?లేదా? మొదలగు విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే .
సినిమా విషయానికొస్తే
ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో వచ్చిన దేవర PART-1 మూవీ, మొదటిభాగం దేవర చుట్టూ కథతిరుగుతుంది. రెండవ భాగం వర చుట్టూ ఉంటుంది. దేవర పాత్ర వరకు బాగానే ఉన్న , వర పాత్ర నుంచి కథను సాగదీసినట్లు అనిపిస్తుంది. రెండవ భాగం కథలో వేగం తగ్గిన ఫీలింగ్ వస్తుంది.
హీరోయిన్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో ఉన్న పాటలకి ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా డైరెక్టర్ చూసాడు.
రెండవ భాగం లో ఎక్కువ కామెడీ మీద ఫోకస్ చేసినట్లు అనిపిస్తుంది. దాంతో రెండవ భాగం కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది.
మొత్తానికి దేవర విజువల్స్ ,యాక్షన్ ఎపిసోడ్స్ , పర్పార్మెన్స్ , ప్రీ క్లైమాక్స్ లో సముద్రం లోపల ఎన్టీఆర్ తో వచ్చే సీన్లు అన్ని టాప్ రేంజ్ లో ఉన్నాయి. దేవర,భైరవ పాత్రల ముగింపు ఏమిటనేది దేవర PART-2 కి లీడ్ ఇస్తుంది.
మొత్తానికి దేవర ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి.
One thought on “Devara Movie Review: ‘దేవర’ మూవీ రివ్యూ ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఎలా ఉందంటే”