Devara Day 3 Collections: భారీ కలెక్షన్ల దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ దేవర
Devara Day 3 Collections: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొడుతుండి. మొదటి వీకెండ్ లి దేవర సత్తా చాటాడు. మొదటి రోజు కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం వలన రెండో రోజూ కలెక్షన్ల పై ఈ ప్రభావం పడింది. అలాగే దేవర ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా మారింది.
కానీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మూడవ రోజు కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. మొత్తానికి మొదటి వీకెండ్ లో దేవర భారీ కలెక్షన్స్ రాబట్టింది.
సెప్టెంబర్ 27 న విడుదలైన ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం చేసాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా మూడు రోజు లకు 304 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
మొదటి రోజు 172 కోట్లు, రెండవ రోజు 71కోట్లు, మూడవ రోజు 61 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దేవర భారీ కలెక్షన్స్ రాబట్టడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఈ భారీ కలెక్షన్ల నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల టార్గెట్ ను చాలా సులభంగా అందుకునేలవుంది. ప్రస్తుతం దేవర సినిమాకు మరో పెద్ద సినిమా పోటీ లేవపోవడం కలిసొచ్చే అంశం. దగ్గరలో దసరా పండుగ దేవర కు కలిసొచ్చే మరొక అంశం. దీంతో కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.
కాబట్టి దేవర 500 కోట్ల టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్ట కాదని చెప్పవచ్చు.
One thought on “Devara Day 3 Collections: భారీ కలెక్షన్ల దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ దేవర”