Devara: దేవర సక్సెస్ మీట్ ను.. రద్దు చేసిన ఏపి ప్రభుత్వం

Devara: దేవర సక్సెస్ మీట్ ను.. రద్దు చేసిన ఏపి ప్రభుత్వం

Devara: ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న దేవర కు ప్రేక్షకులకు క్యూ కడుతున్నారు. రిలీజ్ అయినా మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. రిలీజ్ అయినా మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగానే ఉన్న తరువాత క్రమంగా తగ్గుతూ ఉన్నాయని సమాచారం.

నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి అవడం వలన సెలవు , ఇక 3 వ తేది నుంచి దసరా సెలవులు కావడం తో మరొక వారం రోజులు దేవర సందడి చేయనుంది. తాజాగా ఎన్టీఆర్ కు , దేవర ఫాన్స్ కి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

దేవర సినిమా సక్సెస్ ఈవెంట్ ను రద్దు చేసినట్లు వార్తలు రావడం తో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబందించి అధికారిక ప్రకటన రాలేదు.

దేవర బ్లాకు బస్టర్ హిట్ అవడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చెయ్యాలని మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే , ఇది ఎప్పుడు?ఎక్కడ? అనేదాని పై ఇక క్లారిటీ రావాలి. అయితే , ఈ సినిమా కి సంబందిన ప్రమోషన్స్ తెలుగులో సరిగ్గా చేయలేదు.

ఈ మూవీ కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దయిన విషయం తెలిసిందే.కాబట్టి, రెండు తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ ఈవెంట్ ను అభిమానుల సమక్షంలో జరపాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 2 లేదా 3 న జరిగే అవకాశాలున్నాయని టీ టౌన్ వర్గాలలో వార్తలు వినిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *