CM CHANDRABABU: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

CM CHANDRABABU: తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై తాజాగా సుప్రీంకోర్టు జరిపిన విచారణలో భాగంగా తన తీర్పును వెలువడించింది. అయితే , సుప్రీంకోర్టు తీర్పు పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Supreme Court: తిరుమల లడ్డు వివాదంపై … స్వతంత్ర దర్యాప్తు సంస్థ కు సుప్రీంకోర్టు అంగీకారం

ఈ దర్యాప్తు సంస్థలో సిబిఐ నుంచి ఇద్దరు, ఏపీ రాష్ట్రప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీస్ లు , ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని తెలిపింది. అయితే CBI డైరెక్టర్ ఈ స్వతంత్ర దర్యాప్తును పర్యవేక్షిస్తాడు అని తెలిపారు.

కాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడించిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం . అలాగే ఈ స్వతంత్ర దర్యాప్తు బృందంలో సిబిఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ సభ్యులతో కూడిన బృందం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాము అంటూ ఎక్స్ వేదిక గా తన అభిప్రాయాన్ని పోస్ట్ రూపంలో రాసుకోచ్చారు. “సత్యమేవ జయతే”,” ఓం నమో వెంకటేశాయ” అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *