benjamin netanyahu: పశ్చిమాసియా దేశాలలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. హమాస్, హెజ్‌బొల్లా చీఫ్ లను వరుసగా హతమార్చిన ఇజ్రాయిల్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇజ్రాయిల్ ప్రధాని ఇంటిని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి జరగడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే రెండు రోజుల క్రితమే హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ను ఇజ్రాయిల్ మట్టు పెట్టింది. యహ్యా సిన్వార్ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
Benjamin Netanyahu: యహ్వా సిన్వార్ మృతి తో…కీలక వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయిల్ ప్రధాని
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా లెబనాన్ వైపు నుంచి డ్రోన్ల దాడి జరిగింది. ప్రధాని ఇల్లు లక్ష్యంగా జరిగిన ఈ డ్రోన్ దాడి సమయంలో, ఇంటిలో ప్రధాని, అతని భార్య ఎవరూ లేరని ప్రభుత్వం తెలిపింది. ఈ దాడిలో ప్రధాని నెతన్యాహుకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇజ్రాయిల్ ప్రభుత్వం వెల్లడించింది.
లెబనాన్ వైపు నుంచి 3 డ్రోన్లు తమ భూభాగంలోకి దూసుకు వచ్చాయని ఇజ్రాయిల్ బలగాలు పేర్కొన్నాయి. డ్రోన్లు వచ్చిన వెంటనే సైరన్ లో మోగడంతో అప్రమత్తమైన ఇజ్రాయిల్ సైన్యం 2 డ్రోన్లు గాలిలోని పేల్చివేసామని, మరొకటి మాత్రం ఒక భవనాన్ని ఢీ కొట్టిందని ఇజ్రాయిల్ తెలిపింది. అయితే ఈ డ్రోన్ దాడులు మాత్రం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ను హత్య చేయడానికే జరిగినట్లు ఇజ్రాయిల్ వర్గాలు అనుమానిస్తున్నాయి.