ap weather: ఏపీ ప్రజలకు అలెర్ట్… ఏపీలో మళ్లీ సోమవారం నుంచి వర్షాలు మొదలుకానున్నాయి. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరొకవైపు ఏపీవ్యాప్తంగా సోమవారం పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
BADVEL: బద్వేల్ ఘటన పై వైఎస్ జగన్ ఆవేదన … ఇదేమి రాజ్యమంటూ!
ఏపీని వానలు వదలడం లేదు.ఇటీవలే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసాయి. ముఖ్యంగా దక్షిణ కొస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయి. అది మరువకముందే ఏపీని మరొక వాయుగుండం భయపెడుతోంది. బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని, అది రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అక్టోబర్ 25న మత్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించింది. అదేవిధంగా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన మధ్య కారులను తిరిగి రావాలని ఆదేశించింది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం…
అల్పపీడనం అక్టోబర్ 22 నాటికి మారుతుందని తెలిపింది. అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ తుఫాను వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 24వ తేదీన ఒడిశా – పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.