AP VOLUNTEER: కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని , అలాగే వారి యొక్క గౌరవ వేతనం 10,000 రూ. లకు పెంచుతామని హామీ ఇచ్చింది. అక్టోబర్ 10న జరగబోయే కాబినెట్ సమావేశం లో వాలంటీర్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది.
pm kisan beneficiary status: అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల … లిస్టు లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకొండిలా!
ఏపీ ప్రభుత్వం వాలంటీర్ లకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమచారం . అక్టోబర్ 10న ఏపీ కాబినెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలలో కొన్ని కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా వాలంటీర్ల యొక్క గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 రూ. పెంచుతామని హామీ ఇచ్చింది. కాగా రేపటి క్యాబినెట్ సమావేశం లో ఇందుకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా అప్పటి వైసీపీ ప్రభుత్వం , పధకాల అమలు , లబ్ధిదారుల గుర్తింపు , పెన్షన్ల పంపిణీలో కీలక పాత్ర పోషించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత వాలంటీర్ల పాత్రను శూన్యం చేశారు.
అయితే , రేపటి కాబినెట్ సమావేశంలో వాలంటీర్ల వేతనం 10,000 రూ. లకు పెంచి , వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. రేపటి కాబినెట్ చర్చల్లో వలంటీర్ల పట్ల సానుకూలంగా స్పందిస్తే వాలంటీర్లు త్వరలోనే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.