AP RATION CARD: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు లపై మరొక కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు తో పాటు రేషన్ కార్డు లలో మార్పులు,చేర్పులు .. అడ్రెస్స్ మార్చడం లేదా కార్డు లను సరెండర్ చేయడం మీద ఫోకస్ చేసింది. ఈ అంశాలపై 10న కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకోనుంది. అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అదేవిధంగా పాత రేషన్ కార్డులలో మార్పులు,చేర్పులుకు కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 10న జరిగే కాబినెట్ సమావేశాల్లో రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకోనున్నారు.
6వేల రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ తో పాటు 4 వేలకు పైగా కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయనుంది. గత ప్రభుత్వం నెల ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 10 వేలకు, పట్టణాలలో 12 వేలకు పైన ఉంటే వారిని రేషన్ కార్డు కు అనర్హులుగా నిర్ణయించింది. దాంతో అంగన్వాడీ కార్యకర్తలు, పొరుగు సేవల ఉద్యోగుల రేషన్ కార్డు తొలగించబడి, ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. వారు ఈ ప్రభుత్వమైన కుటుంబ ఆదాయ పరిమితి పెంచి, తమకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.
One thought on “AP RATION CARD: కొత్త రేషన్ కార్డులపై … ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం”