AP Highcourt:హైకోర్టులో ఆదిమూలం కు ఊరట
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం … ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడేఅవకాశం.
ఆంధ్ర ప్రదేశ్ లో వానలు మళ్లీ మొదలయ్యాయి. రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతాన్ని అనుకొని ఉన్న అల్పపీడనం బలహీన పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్తాంధ్ర జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురు గాలులు గంటకు నలభై నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నది.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఇప్పటికే చాలా చోట్ల మంగళవారం నుంచి వానలు పడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది
అటు తెలంగాణ లోని కరీంనగర్, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్, నల్గొండ , హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి .
ఆంధ్ర ప్రదేశ్ లో అల్పపీఠనం ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం ,అనకాపల్లి విజయనగరం, కాకినాడ, కోనసీమ, అల్లూరి, సీతారామరాజు, ఏలూరు, కృష్ణ ,పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లా, తూర్పుగోదావరి, గుంటూరు, పల్నాడు, బాపట్ల , జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
అటు నెల్లూరు ,ప్రకాశం ,నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్సార్ జిల్లా ,చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు సంస్థ ఎండి రోణంకి కూర్మానాద్ తెలిపారు.
ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు తో కూడిన వానలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పొలాల్లో పనిచేసేవారు, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని తెలిపింది.
అలాగే భవనాలు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది.సముద్రతీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో మత్యకారులు చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
One thought on “AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం … ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడేఅవకాశం.”