AP HEAVY RAINS: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర రూపం దాల్చి వాయుగుండంగా మంగళవారం మారింది.
AP RAINS: ఏపీని వణికిస్తున్న వానలు… రెడ్ అలెర్ట్ జారీ
ఈ వాయుగుండం రేపు నెల్లూరు పుదుచ్చేరి మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధ గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, తీరంలో వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని అమరావతి వాతావరణం శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో మరొక అల్పపీడం కొనసాగుతుంది.
గత రెండు రోజుల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. కావలిలో 15 సెం.మీ వర్షపాతం నమోదుకగా, బాపట్ల జిల్లా అడ్డంకి లో 14 సెం.మీ వర్షపాతం, నెల్లూరు జిల్లా కందుకూరు లో 12 సెం.మీ , వైస్సార్ జిల్లా కోడూరు లో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది.నెల్లూరు జిల్లా లో నేడు, రేపు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
నెల్లూరు, ప్రకాశం, వైస్సార్, అన్నమయ్య జిల్లా, తిరుపతి,చిత్తూరు జిల్లా లో నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాలలోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు.
One thought on “AP HEAVY RAINS: నేడు, రేపు భారీ వర్షాలు..”