AP HEAVY RAINS: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రేపు పాండిచ్చేరి , నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటే సమయంలో తీర ప్రాంతంలో ఉన్న జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.
నెల్లూరు కడప తిరుపతి చిత్తూరు ప్రకాశం అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బాపట్ల, సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
AP RAINS: నేడు, రేపు భారీ వర్షాలు..
ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్
ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఏస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వలన మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించారు.
One thought on “AP HEAVY RAINS: ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్.. 6 జిల్లాలకు రెడ్ అలెర్ట్”