AP NEWS TELUGU: లడ్డూ వివాదంపై దర్యాప్తు నిలిపివేచిన “సిట్ ”
AP NEWS TELUGU: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (సిట్) దర్యాప్తును నిలిపివేసింది. సుప్రీంకోర్టులో లడ్డు వివాదంపై సోమవారం జరిగిన విచారణ నేపథ్యంలో సిట్ దర్యాప్తును వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
IND VS BAN : నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి… ఒక్క రోజే 18 వికెట్లు
రాష్ట్ర ప్రభుత్వము నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ బృందంతోనే దర్యాప్తు జరపాలా లేక మరొక సంస్థతో దర్యాప్తు జరుపుకుంటారు అన్న విషయంపై సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా సిట్ తన దర్యాప్తును నిలిపివేసింది. తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యి జంతు కొవ్వుతో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపణలపై స్వతంత్ర సంస్థ తో దర్యాప్తు జరిపించాలని మాజీ టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తో పాటు సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే నెయ్యి కల్తీ విషయంపై మూడు రోజుల పాటు సిట్ దర్యాప్తు చేసింది. నెయ్యి కల్తీ జరిగితే ఫిర్యాదులో ఆలస్యం ఎందుకు జరిగిందనే అంశాలతో పాటు పలు ముఖ్యమైన విషయాలపై టీటీడీ అధికారులను సిట్టు ప్రశ్నించింది.
One thought on “AP NEWS TELUGU: లడ్డూ వివాదంపై దర్యాప్తు నిలిపివేచిన “సిట్ “”